Engineering: మెరిట్ ప్రకారమే సీట్లు.. విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు..
Sakshi Education
ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలన్నీ మెరిట్ ప్రకారమే సీట్లు భర్తీ చేయాలని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రవేశాల, ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మన్ జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఆయన సెప్టెంబర్ 17న ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉన్నత విద్యా మండలి బీ కేటగిరీ సీట్ల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు పంపిన నేపథ్యంలో పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపారు. కళాశాలలు సీట్లు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలపై స్పందిస్తూ ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. మెరిట్ ప్రకారం కాలేజీ సీట్లు ఇవ్వని పక్షంలో ఆధారాలతో తమను ఆశ్రయించాలని, నేరుగా ఫిర్యాదు తీసుకుని న్యాయం చేస్తామని ఆయన చెప్పారు.
చదవండి:
Engineering: ఇంజనీరింగ్‌లో.. న్యాక్ రెండు కొత్త కోర్సులకు శ్రీకారం..
Engineering: ‘బీ’ కేటగిరీ సీట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ
Published date : 18 Sep 2021 01:46PM