మూడు ఇంజనీరింగ్ కాలేజీలకు జరిమానా
నిబంధనలకు విరుద్ధంగా మెరిట్ పాటించలేదని, అందుకే జరిమానా విధించామని ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు తెలిపాయి. మెరిట్ పాటించకుండా ‘బి’కేటగిరీ సీట్లు భర్తీ చేసిన కేఎంఐటీ కాలేజీకి రూ.70 లక్షలు, సీవీఆర్‌కు రూ.10 లక్షలు, గురునానక్ కాలేజీకి రూ.10 లక్షలు జరిమానా వేసింది. యాజమాన్య కోటా (బి–కేటగిరీ) సీట్లను ముందుగా జేఈఈ ర్యాంకర్లకు, తర్వాత ఎంసెట్ ర్యాంకర్లకు వాళ్లూ ముందుకు రాకపోతే ఇంటర్ మార్కుల్లో ఎక్కువ ర్యాంకులు సాధించిన వారికి ఇవ్వాలి. కానీ పలు కాలేజీలు ఇష్టానుసారం పెద్దఎత్తున డబ్బులు తీసుకుని సీట్లు అమ్ముకున్నాయనే ఫిర్యాదులొచ్చాయి. వీటిపై వివరణ ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌సీ కోరింది.
చదవండి: తగ్గాల్సిందే... తగ్గేదేలే.. ఎఫ్‌ఆర్‌సీ ఎదుట 20 కాలేజీల వాదన
కాలేజీలు ఇచి్చన వివరణతో సంతృప్తి చెందని ఎఫ్‌ఆర్‌సీ జరిమానాలు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన సీట్లను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ఎఫ్‌ఆర్‌సీ భావిస్తోంది. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన 15కు పైగా కాలేజీలకు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ నోటీసులిచ్చినా.. వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.