Jobs: కాగ్నిజెంట్‌కు 714 మంది ఎంపిక
2022 విద్యా సంవత్సరానికి జరుగుతున్న క్యాంపస్ నియామకాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన 90 కంపెనీల నుంచి కేఎల్ విద్యా సంస్థకు చెందిన 3,062 మంది ఆఫర్లు పొందారు. ఇందులో 250 సూపర్ డ్రీమ్, 900కు పైగా డ్రీం ఆఫర్లున్నట్టు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ వెల్లడించారు. గత 52 రోజుల్లో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో అక్టోబర్ 22న ఆయన మీడియాతో మాట్లాడారు. డెలాయిట్, అమెజాన్, ఒరాకిల్, టైగర్ అనలిటిక్స్ వంటి ప్రముఖ కంపెనీల్లో తమ విద్యార్థులు ఉద్యోగాలు పొందటం విశేషమన్నారు. ప్రధానంగా కాగ్నిజెంట్ కంపెనీ నుంచి 714 మంది ఆఫర్లు పొందినట్టు చెప్పారు. మొత్తమ్మీద 85 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో విశేషంగా ఆఫర్లు పొందినట్టు సారథి వర్మ తెలిపారు. సమావేశంలో ప్లేస్‌మెంట్స్ విభాగం డీన్ డాక్టర్ ఎన్బీకే ప్రసాద్, అడ్మిషన్స్స విభాగం డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు తదితరులున్నారు.
చదవండి: