Skip to main content

ఎన్బీఏ గుర్తింపు ఉంటేనే సీట్ల పెంపు, కొత్త కోర్సులు: ఏఐసీటీఈ

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏటా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల్లో 43 శాతం మందికి మించి ఉద్యోగాలు రావడం లేదు. కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమైన నేపథ్యంలో.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీ టీఈ) ఈ అంశంపై దృష్టి పెట్టింది.
విద్యా సంస్థ లకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపుతోపాటు కోర్సులకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు తప్పనిసరి చేస్తోం ది. ఈ మేరకు 2021–22 విద్యా సంవత్సరంలో కోర్సులకు అనుమతులు ఇచ్చేందుకు అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌ –2021ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో ప్లేస్‌మెంట్స్‌ పరిస్థి తిని అందులో వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి విద్యా సంస్థలో నిర్వహించే కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపును తప్పనిసరి చేసింది. 2021–22 విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ గుర్తింపు పొందే విద్యా సంస్థలన్నీ కూడా కనీసం 60 శాతం కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. అలాగైతేనే ఆయా విద్యా సంస్థల్లో మిగతా కోర్సుల నిర్వహణకు అనుమతి ఇస్తామని వెల్లడిం చింది. ఇక సీట్ల సంఖ్య పెంచుకోవాలంటే కూడా ఆయా కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు తప్పనిసరి అని స్పష్టం చేసింది. పాత కోర్సుల్లో సీట్ల పెంపు, కొత్త కోర్సులు, కాలేజీలకు అనుమతుల కోసం యాజమాన్యాలు వచ్చే నెల 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఎన్‌బీఏ కోసం 300 మంది సీనియర్‌ మార్గదర్శకులు
విద్యా సంస్థల్లో కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు పొందేందుకు అవసరమైన సహకారం అందించేం దుకు ఏఐసీటీఈ 300 మంది సీనియర్‌ విద్యావేత్తలను మార్గదర్శకులుగా నియమించింది. అలాగే బాగా నడిచే 501 విద్యా సంస్థలను మెంటారింగ్‌ విద్యా సంస్థలుగా గుర్తించింది. వాటి సహకారంతో దేశంలోని అన్ని విద్యా సంస్థలు తమ కాలేజీల్లోని కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు తెచ్చుకునేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎన్‌బీఏ గుర్తింపు కలిగిన కోర్సుల్లో సీట్ల పెంపు, కొత్త కోర్సుల ప్రారంభాన్ని ఆరేళ్లలో ఒకేసారి చేసుకోవాలని స్పష్టం చేసింది. గతేడాది కనీసంగా 50 శాతం సీట్లు భర్తీ అయిన విద్యా సంస్థలకే కొత్త కోర్సులను ఇస్తామని వెల్లడించింది.

ఉత్తీర్ణులు అధికమే.. ఉద్యోగాలు రావట్లే..
ఏటా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. వారిలో 80% వరకు పాస్‌ అవుతున్నారు. కానీ ఇందులో తక్కువ మం దికే ఉద్యోగాలు లభిస్తున్నట్లు ఏఐసీటీఈ అంచనా వేసింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగాలు పొందినవారి సంఖ్య 43 శాతానికి మించలేదని పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పరిస్థితి ఇదీ..

సంవత్సరం

విద్యాసంస్థలు

మొత్తం సీట్లు

చేరినవారు పాసైనవారు

ఉద్యోగాలు

శాతం

2016–17

10,357

36,98,706

19,52,775

17,12,269 7,21,785

36.96

2017–18

10,393

36,98,706

18,95,134

15,71,288 7,15,793

37.77

2018–19

10,415

33,91,497

18,56,776

15,49,810 7,95,090

42.82

2019–20

10,950

32,79,666

18,55,058

15,22,856 7,78,416

41.95

Published date : 10 Mar 2021 04:24PM

Photo Stories