Skip to main content

IIT: ఐఐటీల్లో క్రెడిట్‌ ఫ్రేం వర్క్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని 23 ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో జాతీయ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు.
IIT
ఐఐటీల్లో క్రెడిట్‌ ఫ్రేం వర్క్‌

ఐఐటీ భువనేశ్వర్‌లో ఏప్రిల్‌ 18న జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూజీసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జగదీశ్‌ కుమార్‌ నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ పురోగతిని వివరించారు. దీని అమలుకు యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీవీఈటీ, ఎన్‌సీఈఆర్‌టీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వశాఖతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

చదవండి: Krishna Ella: మానవ వనరుల అభివృద్ధిలో భారత్‌ నం.1

ఎలిమెంటరీ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు వివిధ కేటగిరీలుగా విభజించి, ప్రతీ విభాగానికి కొన్ని క్రెడిట్స్‌ ఇవ్వడం దీని ఉద్దేశం. దీనివల్ల ఎవరైనా ఏ కోర్సు అయినా చేసే వెసులుబాటు వస్తుంది. దీనిపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఐఐటీలు వర్క్‌షాపులు నిర్వహించాయి.   

చదవండి: చదువుల తల్లులు.. ఉన్నత విద్యలో ఏటా పెరుగుతున్న విరి చేరికలు

Published date : 20 Apr 2023 01:52PM

Photo Stories