Skip to main content

Engineering: బీ కేటగిరీ సీట్లకు అందరి దరఖాస్తులు తీసుకోవాలి

Engineering
Engineering
  • ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఏఎఫ్‌ఆర్‌సీ ఆదేశం 

ఇంజనీరింగ్‌ బీ కేటగిరీ సీట్ల ప్రవేశాల ప్రక్రియ అక్టోబర్‌ 5వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలను రాష్ట్ర అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) ఆదేశించింది. బీ కేటగిరీ సీట్లు అమ్మేసుకున్నారనే వార్తల నేపథ్యంలో... ఎట్టి పరిస్థితుల్లోనూ అందరి దరఖాస్తులు తీసుకోవాలని కాలేజీలకు సూచించింది. ఒకవేళ కళాశాలలు దరఖాస్తులను తిరస్కరిస్తే వాటిని అక్టోబర్‌ 1వ తేదీలోగా తమ కార్యాలయానికి పంపాలని కమిటీ పేర్కొంది.  

Published date : 25 Sep 2021 03:53PM

Photo Stories