RGUKT: ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 900 మందికి ప్రవేశాలు
1086 మందికి కాల్ లెటర్స్ పంపించగా, జూలై 24, 25న నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 900 మంది హాజరయ్యారు. క్యాంపస్‌లో 1100 సీట్లు ఉండగా, స్పోర్ట్సు, ఎన్‌సీసీ వంటి ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్ మెరిట్ లిస్టు సిద్ధం కాలే దు. ఈ నేపథ్యంలో 1086 మంది మెరిట్ జాబి తా సిద్ధం చేసి, కాల్ లెటర్లు అందజేశారు.
రెండు రోజుల్లో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తిచేయగా, 186 మంది గైర్హాజరయ్యారు. ప్రస్తుతం శ్రీకాకుళం క్యాంపస్‌లో 200 సీట్లు మిగిలాయి. త్వరలో మెరిట్ జాబితా ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 1100 మందికి ఆగస్టు మొదటి వారం నాటికి ప్రవేశాలు కల్పించి, రెండో వారంలో క్లాస్‌వర్క్ ప్రారంభిస్తారు.
చదవండి: IIIT Admissions: ప్రారంభం.. కవలలకు సీట్లు.. ఆగస్టు 10 నుంచి క్లాస్‌వర్క్
కౌన్సెలింగ్‌ను డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీశ్వరరావు పర్యవేక్షించారు. 30 ధ్రువీకరణ పత్రాల పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ చేశారు.
విద్యార్థులతో వచ్చిన తల్లిదండ్రులకు విశ్రాంతి గదులు కేటాయించారు.వర్షం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్స్‌లో వసతి సైతం కల్పించారు.
చదవండి: RGUKT: ముగిసిన ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్.. రెండు రోజుల్లో ఇన్ని సీట్ల భర్తీ