Skip to main content

Dharma Naik: న్యాక్‌తో ప్రపంచస్థాయి గుర్తింపు

నల్లగొండ రూరల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి న్యాక్‌లో ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందని పూర్వ విద్యార్థుల సంఘం రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ ధర్మానాయక్‌ తెలిపారు.
Global recognition with NAAC
న్యాక్‌తో ప్రపంచస్థాయి గుర్తింపు

ఏప్రిల్ 9న‌ స్థానిక దూర విద్యాకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాక్‌ పరిశీలన తర్వాత కోత్త కోర్సులను ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే పూర్వవిద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ విద్యార్థుల అధ్యక్షుడిగా నరదాస్‌ సైదబాబును, సభ్యులుగా శివకుమార్‌, వెంకట్‌, జెల్లా యాదయ్యను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో దూరవిద్య కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌రావు, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

ఉర్దూ వర్సిటీకి న్యాక్‌ ఏ–ప్లస్‌ గ్రేడ్‌

NAAC: పారితోషికం రూ.లక్ష ఇస్తామన్నా ఆసక్తి చూపని యాజమాన్యాలు

Published date : 10 Apr 2023 06:05PM

Photo Stories