Skip to main content

TS EAMCET 2022 Result: టీఎస్ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యేది ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : రాష్ట్ర ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్‌) ఫలితాల వెల్లడి తేదీ ఆగ‌స్టు 11వ తేదీన‌ (గురువారం) ఖరారుకానుంది.
TS EAMCET Results 2022 date and Time

దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ జరగనుంది. ఇందులో ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్, మండలి కార్యదర్శి శ్రీనివాస్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.

టీఎస్ ఎంసెట్‌-2021 (ఇంజ‌నీరింగ్‌) కాలేజ్ & ర్యాంక్‌ ప్రిడిక్ట‌ర్ కోసం క్లిక్ చేయండి

మంత్రి ఎప్పుడు తేదీ ఇస్తారో.. అప్పుడే.. 
ఎంసెట్‌ ఫలితాల తీరు తెన్నులు, ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను ఈ కమిటీలో చర్చిస్తారు. ఎంసెట్‌ ఫలితాల విడుదల ఆగ‌స్టు 15వ తేదీలోపే ఉండే వీలుంది. తామంతా సిద్ధంగానే ఉన్నామని, మంత్రి ఎప్పుడు తేదీ ఇస్తారో చూడాలని అధికారులు అంటున్నారు. ఎంసెట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవ్వ నుంది.

EAMCET 2022 Rank Predictor: Check Expected Rank based on Marks

మరోవైపు జేఈఈ ఫలితాలు వెల్లడవ్వడం, ఆగ‌స్టు నెలాఖరు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఎన్ని దఫాల్లో పూర్తి చేయాలనే విషయాలపై అధికారులు చర్చిస్తారు. కాగా, ఫలితాల వెల్లడి తర్వాత జేఎన్‌టీయూహెచ్‌ తన పరిధిలోని ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేసి, అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

ఎంసెట్‌కు భారీగానే..
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ మూడు రోజులు జ‌రిగిన ప‌రీక్ష‌ల‌కు తెలంగాణ‌, ఏపీ నుంచి 91 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఈసారి సకాలంలోనే నిర్వహించిన‌ ఎంసెట్‌కు భారీగానే పోటీ నెలకొంది. ఈ సారి ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. ప‌రీక్ష‌కు మాత్రం 1,56,812 మంది హాజ‌ర‌య్యారు.  TS EAMCET Keyని కూడా విడుద‌ల చేశారు.

TS EAMCET 2022 Rank Predictor : ఎంసెట్‌-2022 ప‌రీక్ష రాశారా..? మీకు వ‌చ్చే మార్కుల‌కు ఎంత ర్యాంక్ వ‌స్తుందో తెలుసా..?

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు మాత్రం..
అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,150 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు ప‌రీక్ష‌లు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో జ‌రిగిన విష‌యం తెల్సిందే. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వ‌చ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండు రోజుల పాటు జ‌రిగిని 85.3 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు ఎంసెట్ కన్వీన‌ర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్‌ తెలిపారు. పరీక్షకు 80575 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కీ కూడా విడుద‌ల చేశారు. TS EAMCET Results 2022 ను ఆగ‌స్టు 12 లేదా 13వ తేదీల్లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. TS EAMCET Results 2022 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

AP EAMCET 2022 College Predictor : మీ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసా..?

How to check TS EAMCET 2022 Results:
☛ Visit results.sakshieducation.com or sakshieducation.com
☛ Click on TS EAMCET 2022 Results link available on the home page
☛ In the next page, enter your hall ticket no. and click on submit
☛ The results will be displayed on the screen
☛ Save a copy of the marks sheet for further reference

ఏపీ ఎంసెట్‌-2022 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి

Published date : 11 Aug 2022 01:03PM

Photo Stories