Skip to main content

ఎంసెట్ లో మంచి మార్కులు సాధించటం ఎలా?

Education News ఎంసెట్ లాంటి కాంపిటీటివ్ పరీక్షల్లో విజయం సాధించాలంటే సబ్జెక్టుపై పట్టు సాధించటం ఒక్కటే సరిపోదు. కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నట్లయితే మంచి ర్యాంకు సాధించడానికి వీలు కలుగుతుంది. లక్షలమంది పరీక్ష రాసేటపుడు ఒక్క మార్కు కూడా చాలా విలువైనదే.

పరీక్షకు ముందు:
 • ఇటువంటి పోటీ పరీక్షలు రాసేవారు నూటికి పదిమంది మాత్రమే గట్టిగా కృషి చేస్తారు. మిగతా 90 మంది ఒక రాయి వేసి చూద్దామనుకునేవారే. కాబట్టి మీరు సీరియస్‌గా ప్రిపేరయినట్లయితే మీకు నిజమైన పోటీ పదిశాతం మాత్రమే అని గుర్తించండి. ఈ ఏడాది సుమారు 2,80,000 మంది ఇంజనీరింగ్, 1, 12,000 మంది మెడిసిన్‌కూ సిద్ధమవుతున్నారు. అంటే ఇంజనీరింగ్ రాసేవారికి నిజమైన పోటీ 28,000. మెడిసిన్‌లో 11,200 మాత్రమే మీకు పోటీ కాబట్టి ధైర్యంగా ప్రిపేర్ అవండి.
 • పరీక్షకు వారం ముందు కొత్తవి చదవడానికి ప్రయత్నించకండి. చదివిన వాటిని పునశ్చరణ చేసుకుంటూ ముఖ్యమైన ఫార్ములాలు, ప్రిన్సిపల్స్, డెఫినిషన్‌‌స విడిగా క్విక్ రిఫరెన్‌‌సకు రాసుకోండి.
 • వీలైనన్ని మాక్ టెస్టులు రాయండి. దీనివల్ల మీకు ప్రశ్నపత్రం నమూనా తెలియడమే కాక ఎక్కడ మీరు వెనుకబడి ఉన్నారో తెలుస్తుంది. స్పీడ్ ప్రాక్టీస్‌కు కూడా అవకాశం కలుగుతుంది. చాలా వెబ్‌సైట్లు తక్కువ ధరకే మాక్‌టెస్ట్‌లు అందిస్తున్నాయి.
 • పరీక్షకు ముందు వారం రోజులు మీ తల్లిదండ్రులతో గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇటువంటి పరీక్షలకు పాజిటివ్ ఎంకరేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ అవసరం. అంటే మీ చుట్టూ మిమ్మల్ని ప్రోత్సహించే వారితో గడిపితే, మీరు ఎక్కువగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష రోజు :
Bavitha
 • ముఖ్యంగా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకుని, పరీక్షా కేంద్రంలో రిలాక్స్ అవండి. అంతేగాని అదరాబదరాగా చివరి నిమిషంలో చేరుకున్నట్లయితే మీ మనసంతా గాబరా గాబరాగా తయారై పరీక్షమీద పూర్తి శ్రద్ధ పెట్టలేరు.
 • ఐఐటీలా ఎంసెట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉండదని గ్రహించండి. అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి తగినంత సమయం అవసరం.
 • మొదట ప్రశ్నపత్రం మొత్తం చదువుకుంటూ వెళ్లిపోండి. సులభమైన ప్రశ్నలకు సమాధానాలు వెంటనే రాయవచ్చు. ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియనపుడు దానికోసం అప్పుడు ఆగవద్దు. దానివలన సమయం వృధా అవుతుంది.
 • మొదటి రౌండ్‌లో కనీసం 40 శాతం ప్రశ్నలకు మీరు తేలికగా సమాధానం రాయగలుగుతారు. ఇవి అందరికి ఒకేరకంగా ఉంటాయి. అంటే అందరూ వీటికి సమాధానాలు రాయగలుగుతారు.
 • రెండో రౌండ్‌లో మరలా రాని ప్రశ్నలకు సమాధానాలు రాయటానికి ప్రయత్నించండి. దీనివల్ల 20 శాతం ప్రశ్నలకు సమాధానాలు రాయగలరు. ఈ ప్రశ్నలకు కూడా 40 శాతం మంది సమాధానాలు రాయగలరు.
 • ఇక మిగిలిన 40 శాతం ప్రశ్నలు కష్టమైనవి. మీరు గట్టిగా కృషి చేస్తే వీటిలో కనీసం 10 శాతం సమాధానాలు రాయగలరు.
 • ఇక మిగిలిన 30 శాతం ప్రశ్నలను వదిలిరాకుండా వాటికి కూడా సమాధానాలు పూరించండి. ఎందుకంటే నెగటివ్ మార్కులు లేవు కాబట్టి ఏదో ఒక సమాధానం రాయండి.
 • ఏదో ఒక సమాధానం రాసేటపుడు మిగిలిన ప్రశ్నలన్నింటికి ఒకే సమాధానం రాసినట్లయితే 25శాతం సమాధానాలు కరెక్టయ్యే అవకాశం ఉంది. మీరు కనుక బి, సి , డి, సి అని పెడితే సమాధానాలు సి, బి,సి,బి అయినట్లయితే అన్ని తప్పవుతాయి. కాబట్టి అన్ని ఒకటే పెట్టినట్లయితే కొన్నయినా కరెక్టవుతాయి.
 • సామాన్యంగా సమాధానాలు బి,సి లే ఎక్కువగా ఉంటాయి. ఎ,డి,లు తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మిగిలినవన్నింటికి ఒకే సమాధానం బి కాని సి కాని పెట్టినట్లయితే కొన్ని ప్రశ్నలకైనా మార్కులు వచ్చే అవకాశం ఉంది.
పరీక్ష తరువాత:
 • పరీక్ష రాసిన తరువాత ఎవరితోనూ దాని గురించి చర్చింవద్దు. తప్పయినా, ఒప్పయినా వాటిని తిరిగి మార్చలేం. మీరు రాసింది తప్పు అని ఎవరైనా అంటే మరింత నిరుత్సాహం ఆవరించి తదుపరి పరీక్షల మీద శ్రద్ధ పెట్టలేరు.

అల్ ది బెస్ట్!

EAMCET Study Material, Previous Papers & Model Papers Click Here

Published date : 19 May 2014 12:41PM

Photo Stories