Skip to main content

TS EAMCET Counselling Details: ఆగ‌స్టు 21 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌..సీట్ల కేటాయింపు తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడికల్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగ‌స్టు 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ts eamcet 2022 counselling dates
ts eamcet 2022 counselling

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి నేతృత్వంలో ఆగ‌స్టు 12వ తేదీ (శుక్రవారం) హైదరాబాద్‌లో జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్‌ సమావేశంలో పాల్గొన్నారు. కాగా అగ్రికల్చర్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను వ్యవసాయ వర్సిటీ తర్వాత ప్రకటిస్తుంది. 

ఎంసెట్‌-2022 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇలా..
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌ :    21–29.8.22
ధ్రువపత్రాల పరిశీలన :    23–30.8.22
ఆప్షన్ల ఎంపిక :    23.8.22–2.9.22
ఆప్షన్స్‌ ఫ్రీజింగ్‌ :    2.9.22
మొదటి దశ సీట్ల కేటాయింపు :    6.9.22
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ వెబ్‌ ద్వారా :    6–13.9.22

రెండో దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ :
రెండో దశ రిజిష్ట్రేషన్‌ :    28–29.9.22
ధ్రువపత్రాల పరిశీలన :    30.9.22
ఆప్షన్లు :    28.9.22–1.10.22
సీట్ల కేటాయింపు:    4.10.22
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ వెబ్‌ ద్వారా :    4–8.10.22

తుది దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ : 
స్లాట్‌ బుకింగ్, రిజిస్ట్రేషన్‌:    11–12.10.22
ధ్రువపత్రాల పరిశీలన:    13.10.22
ఆప్షన్లు :    11–14.10.22
సీట్ల కేటాయింపు :    17.10.22
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కాలేజీ రిపోర్టింగ్‌:    17–21.10.22
స్పాట్‌ అడ్మిషన్లు :    20.10.22

Published date : 13 Aug 2022 06:58PM

Photo Stories