EAMCET 2022: మూడో దశ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీ ఇదే..
ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 21వ తేదీ నుంచి స్లాట్ బుక్ చేసుకునే అభ్యర్థులు 23వ తేదీ వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. అక్టోబర్ 26వ తేదీన సీట్లను కేటాయిస్తారు. రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత ఇంకా 25 వేల సీట్లు మిగలనున్నట్టు అధికారులు తెలిపారు. వీటిని మూడో దశలో భర్తీ చేస్తారు. అప్పటికీ మిగిలిపోతే, స్పాట్ వాల్యుయేషన్ కింద భర్తీ చేస్తారు. మొత్తం మీద ఈ నెలాఖరుకు 2022 ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
☛ College Predictor 2022 - AP EAPCET | TS EAMCET
నవంబర్ మొదటి వారంలో తర గతులు ప్రారంభించే వీలుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలో విడుదల చేస్తామని తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. కొత్తగా పెంచిన ఫీజుల ప్రకారం చెల్లించాల్సిన బ్యాలెన్స్ మొత్తాన్ని కాలేజీల్లోనే చెల్లించాలని అధికారులు తెలిపారు. మొదటి, రెండో దశ సీట్ల కేటాయింపు సమయంలో ఫీజుల నిర్థారణ కాకపోవడంతో 2019లో ప్రకటించిన మేరకే ఫీజులు వసూలు చేశారు. ఇప్పుడు పెంచడంతో గతంలో చెల్లించిన దానికన్నా ఎక్కువ ఉండే వీలుంది. ఈ తేడాను విద్యార్థులు ఇప్పుడు చెల్లించాల్సి ఉంటుంది.
☛ Top Engineering Colleges 2022 - Andhra Pradesh | Telangana