Skip to main content

TSCHE: ఎంసెట్‌ నోటిఫికేషన్‌పై తర్జనభర్జన

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వేరియంట్ల విస్తృతి సంకేతాల నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలపై ఉన్నత విద్యామండలి తర్జనభర్జన పడుతోంది.
EAMCET Notifcation 2023
ఎంసెట్‌ నోటిఫికేషన్‌పై తర్జనభర్జన

అప్రమత్తంగా ఉండాలని ప్రధాని ప్రకటించడంతో జేఈఈ మెయిన్స్‌ తేదీల్లో ఏవైనా మార్పులు ఉంటాయా అనే సందేహాలు అధికార వర్గాల్లో కలుగుతున్నాయి. ఈ ఏడాది కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జేఈఈ తేదీలను రెండుసార్లు మార్చింది. ఇందుకు అనుగుణంగా ఇంటర్, టెన్త్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ కారణంగా కొన్ని రోజులు వేచిచూసి, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2023 జనవరి, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని ఎన్‌టీఏ షెడ్యూల్‌ కూడా ఇచ్చింది.

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

మార్చిలో ఇంటర్‌ పరీక్షల టైంటేబుల్‌ కూడా ఇంటర్‌ బోర్డు వెలువరించింది. వీటన్నింటిబట్టి మేలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించేందుకు, జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ ఇవ్వాలని మండలి వర్గాలు భావించాయి. ఇందుకు సంబంధించి త్వరలో సమావేశం కూడా నిర్వహించాలనుకున్నాయి. కానీ కోవిడ్‌ సంకేతాలు వస్తుండటంతో వెనక్కు తగ్గారు. మరో 15 రోజులపాటు సాధారణ పరిణామాలే ఉంటే, నోటిఫికేషన్‌ విడుదలకు సిద్ధమవుతామని అధికారులు అంటున్నారు. అయితే, నోటిఫికేషన్‌ విషయంలో ఉన్నత విద్యామండలిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీలు ప్రకటించారని, ఎంసెట్‌ తేదీలు కూడా ప్రకటించడం అవసరమని, ఏవైనా మార్పులు ఉంటే తర్వాత చూసుకోవచ్చని కొంతమంది అభిప్రాయపడు తున్నారు. ఏం చేయాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.

Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

Published date : 24 Dec 2022 06:01PM

Photo Stories