TS EAMCET 2022: ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష ప్రారంభం.. పరీక్ష చివరి తేదీ ఇదే..
18, 19, 20 తేదీల్లో మూడు రోజులపాటు, రోజూ రెండు సమయాల్లో ‘కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)’ పద్ధతిలో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్ ఉంటాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. అన్నిచోట్లా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని.. పరీక్ష కేంద్రాలను తేలికగా గుర్తించేందుకు వీలుగా లొకేషన్, రూట్ మ్యాప్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను 15 నిమిషాల ముందు నుంచి అనుమతిస్తామని.. కానీ నిమిషం ఆలస్యమైనా ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. పరీక్షకు ముందు విద్యార్థి కుడిచేయి వేలి ముద్రను తీసుకుంటామని తెలిపారు. నిజానికి జూలై 14 నుంచే ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో 14, 15 తేదీల్లో జరగాల్సిన అగ్రికల్చర్, మెడికల్ విభాగం పరీక్షలను వాయిదా వేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మాత్రం యథాతథంగా నిర్వహిస్తు న్నారు. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ ఇంకా ప్రకటించలేదు.
చదవండి: ఎంసెట్ స్టడీమెటీరియర్, సిలబస్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
భారీగానే దరఖాస్తులు
కోవిడ్ ఉధృతి తర్వాత ఈసారి సకాలంలో నిర్వహిస్తున్న ఎంసెట్‌కు భారీగానే పోటీ నెలకొంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,71,945 మంది.. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 94,150 మంది.. రెండింటికీ 350 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు అందాయని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయన్నారు.
చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..