Skip to main content

AP EAPCET 2021 Results: ఏపీ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి.
AP Eamcet Results

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సెప్టెంబ‌ర్ 8న‌ ఫలితాలు విడుదల చేశారు. ఈఏపీసెట్ లో 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించారని మంత్రి సురేష్ తెలిపారు. దాదాపు 80 శాతం మంది అర్హత సాధించారని వెల్లడించారు. విద్యార్థులు రేపటి(సెప్టెంబ‌ర్ 9) నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. అగ్రి, ఫార్మా ఫలితాలు సెప్టెంబ‌ర్ 14న ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో.. మొదటి ర్యాంకు నిఖిల్‌ (అనంతపురం), 2వ ర్యాంకు మహంత నాయుడు (శ్రీకాకుళం), 3వ ర్యాంకు వెంకట తనీష్( వైఎస్‌ఆర్‌ జిల్లా), 4వ ర్యాంకు దివాకర్ సాయి, (విజయనగరం), మౌర్య రెడ్డి (నెల్లూరు) 5వ ర్యాంకు  సాధించారు.

 

ఏపీ ఈఏపీసెట్‌-2021 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్‌ పేరుతో నిర్వహించేవారు. అయితే మెడికల్‌ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్‌’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మెడికల్‌ విభాగాన్ని ఎంసెట్‌ నుంచి మినహాయించారు. మెడికల్‌ను తొలగించడంతో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)–2021 పేరుతో నిర్వహించారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించి ఆగస్టు 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు.

 

 

Published date : 08 Sep 2021 02:50PM

Photo Stories