DOST 2023-24 Notification : డిగ్రీ ప్రవేశాలకు DOST షెడ్యుల్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ లింబాద్రి మే 11వ తేదీన (గురువారం) ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ప్రవేశాల ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మూడు విడుతల్లో డిగ్రీ ప్రవేశాల దోస్త్ ప్రక్రియ సాగుతుందన్నారు.
రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.1060 కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం హానర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దోస్త్ వెబ్ సైట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
Dost 2023 రిజిస్ట్రేషన్లు మాత్రం..
మే 16వ నుంచి జూన్ 10 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు అవకాశం కల్పించినట్లు తెలిపారు. మే 20వ తేదీ నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాలని, జూన్ 16న మొదటి విడతలో డిగ్రీ సీట్ల కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 16 నుంచి 26 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుందన్నారు. 16 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని, జూన్ 30న రెండో విడతలో సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
ఫీజుల వివరాలు ఇవే..
జూలై 1 నుంచి 5 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, ఒకటి నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, జూలై 10న మూడో విడత సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 17 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు.
దోస్త్ షెడ్యూల్ ఇదే..
ముఖ్య తేదీలు ఇవే..
➤ మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు
➤ మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్స్
➤ జూన్ 16వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
➤ జూన్ 16 నుంచి జూన్ 26 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
➤ జూన్ 16 నుంచి జూన్ 27 వరకు రెండో విడత దోస్త్ ఆప్షన్లు
➤ జూన్ 30వ తేదీన రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
➤ జూలై 1 నుంచి 5 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు
➤ జూలై ఒకటి నుంచి జూలై 6 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలి.
➤ జూలై 10వ తేదీన మూడో విడత సీట్లు కేటాయించనున్నారు.
దరఖాస్తు విధానం :
☛ డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి.
☛ ఇందులో Candidate Pre-Registrationతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
☛ తర్వాత Application Fee Paymentతో తగిన ఫీజును చెల్లించాలి.
☛ ఆ తర్వాత Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.