Skip to main content

DOST-2024 Notification Details and Important dates : డిగ్రీ ప్ర‌వేశాల‌కు.. DOST-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : డిగ్రీలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు DOST-2024 (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేష‌న్‌ను మే 3వ తేదీన విడుద‌ల చేశారు. ఈసారి మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు జరుగనున్నాయి.
Dost 2024 Notification Details

మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్ మే 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉంటుంది. అలాగే మే 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.  జూన్ 3వ తేదీ మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 4వ తేదీ నుంచి 10వ తేదీలోను సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు.రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. విద్యార్థులు పూర్తి వివరాలకు https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

అర్హ‌త‌లు ఇవే
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ఫ‌స్టియ‌ర్‌లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు దోస్త్  ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇంట‌ర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు. అలాగే ఇంటర్‌లో సాధించిన మార్కులు ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. 

దోస్త్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తారు. 1054 కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు. దోస్త్ వెబ్ సైట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. గత ఏడాది డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

DOST 2024 ముఖ్య‌మైన తేదీలు ఇవే..

S.NO

Details

From

To

Phase I

1

Notification

03.05.2024

2

Phase I Registrations
(with registration fee of Rs.200/-)

06.05.2024

25.05.2024

3

Phase I Web options

15.05.2024

27.05.2024

4

Phase I Verification of Special Category Certificates

 

(i) PH/ CAP

24.05.2024

 

(ii) NCC/ Extra Curricular Activities

25.05.2024

5

Phase I Seat allotment

03.06.2024

6

Online self-reporting (by online payment of college fee/seat reservation fee as the case may be) of Phase I by students

04.06.2024

10.06.2024

Phase II

7

Phase II registration
(with registration fee of Rs.400/-)

04.06.2024

13.06.2024

8

Phase II web options

04.06.2024

14.06.2024

9

Phase II Verification of Special Category Certificates

 

PH/CAP/NCC/Extra Curricular Activities

13.06.2024

10

Phase II Seat allotment

18.06.2024

11

Online self-reporting (by online payment of college fee/ seat reservation fee as the case may be) of Phase II by students

19.06.2024

24.06.2024

Phase III

12

Phase III registration
(with registration fee of Rs.400/-)

19.06.2024

25.06.2024

13

Phase III web options

19.06.2024

26.06.2024

14

Phase III Verification of Special Category Certificates

 

PH/ CAP/ NCC/ Extra Curricular Activities

25.06.2024

15

Publishing of Phase III Seat allotment

29.06.2024

16

Online self-reporting (by online payment of college fee/ seat reservation fee as the case may be) Phase III by students

29.06.2024

03.07.2024

17

Reporting to Colleges by the students who have already confirmed their seats online (self-reporting) in Phase-I, Phase-II, Phase-III

29.06.2024

05.07.2024

18

Students Orientation in the College

01.07.2024

06.07.2024

19

Commencement of class work, Semester-I

08.07.2024

Published date : 03 May 2024 02:52PM

Photo Stories