తెలుగు వర్సిటీ ‘దూరవిద్య’కు దరఖాస్తులు
Sakshi Education
హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య ప్రవేశాలు (2017-18) కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ మేరకు డిసెంబర్ 1న దూరవిద్యా కోర్సుల ప్రాస్పెక్టస్‌ను వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ సత్యనా రాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ పరిధిలో దూరవిద్య ద్వారా 17 రకాల కోర్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. 2018 జనవరి 20వరకు ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చని. ఆలస్య రుసు ముతో 28 ఫిబ్రవరి 2018 వరకు ప్రవేశముంటుందన్నారు. వివరాల కోసం తెలుగు వర్సిటీలో లేదా వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు.
Published date : 02 Dec 2017 02:24PM