ఫిబ్రవరి 20 నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు
Sakshi Education
హైదరాబాద్: డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 20 నుంచి నిర్వహించనున్నామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 1వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు వర్సిటీ పోర్టల్‌లో లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు వారి సంబంధిత అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.
Published date : 10 Jan 2019 03:18PM