Skip to main content

పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించి పరీక్షల దరఖాస్తులు అందజేసేందుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థులందరికీ ఇది వర్తిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి డిగ్రీ తృతీయ, ఫిబ్రవరి 3 నుంచి ద్వితీయ, అదే నెల 10 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహణకు రెండు రోజుల ముందు ఆయా స్టడీ సెంటర్ల నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు.
Published date : 12 Dec 2015 02:17PM

Photo Stories