ఓయూ దూరవిద్యలో ప్రవేశాలు
Sakshi Education
హైదరాబాద్: ఓయూలోని ప్రొఫెసర్ జి.రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్‌స ఎడ్యుకేషన్‌లో 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్‌ను వీసీ ప్రొ.రాంచంద్రం జూలై 24న విడుదల చేశారు.
ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలను స్వీకరించనున్నట్లు దూరవిద్య డెరైక్టర్ గణేష్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ లెర్నింగ్, కంప్యూటర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ డిప్లొమా కోర్సుల్లో విదేశీ విద్యార్థులకూ ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. బీఈడీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ ప్రభుత్వ పాలన పాఠ్యాంశాలను నూతనంగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వర్సిటీల్లో ఉన్నత విద్యను మధ్యలో వదిలేసిన అభ్యర్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు, ఇతర వృత్తుల వారు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Published date : 25 Jul 2018 02:48PM