Skip to main content

కేయూ దూరవిద్య కోర్సులకు యూజీసీ డెబ్ అనుమతి

కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సులకు యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డెబ్) అనుమతి లభించింది.
రెండేళ్ల క్రితం దూర విద్య కోర్సుల్లో 25 కోర్సులకే అనుమతిచ్చింది. గతంలో అనుమతి లభించని బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంసీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంబీఏ కోర్సులకు అనుమతి కోసం కూడా అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. వివిధ కోర్సుల నిర్వహణకు కావాల్సిన వసతులు తదితర అంశాలపై డెమో కూడా ఇచ్చారు. దీంతో దూరవిద్యకు సబంధించిన డిగ్రీ, పీజీ తదితర మొత్తం 32 కోర్సు లకు అనుమతి లభించినట్లు ఆగస్టు 10న యూజీసీ నుంచి సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అందులో వివిధ డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు బీసీజే, ఎంసీజే, బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, ఎంఎస్‌డబ్ల్యూ కోర్సులకు అనుమతి లభించింది. అయితే బీఈడీ, ఎంఈడీ, ఎంబీఏలకు అనుమతిస్తూ రెగ్యులేటెడ్ బాడీస్‌తో కూడా అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించింది. ఆయా కోర్సులకు కూడా ఎన్‌సీటీఈ అనుమతి ఉందని అంటున్నారు. దీంతో ఆయా కోర్సులకు ఇక నోటిఫికేషన్ ఇచ్చుకునే వీలు కలిగింది. ఇక యూజీసీ డెబ్ అనుమతి లభించిన కోర్సులకు ఈ విద్యాసంవత్సరంలో (2018-19) నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు. 32 కోర్సులకు ఐదేళ్ల పాటు 2018 - 2019 నుంచి 2022 - 2023 వరకు కూడా అనుమతి లభించింది. తర్వాత మళ్లీ అనుమతికి వెళ్లాల్సి ఉంటుంది.
Published date : 11 Aug 2018 05:06PM

Photo Stories