Skip to main content

కాకతీయ వర్సిటీ దూరవిద్య అడ్మిషన్లకు ఆహ్వానం

హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో చేరటానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని సింధూ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ జె.వెంకట చలపతి జనవరి 19న ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్సెస్సీ, ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన విద్యార్థులు డిగ్రీలో చేరటానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరుటకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 95330 58899, 99088 60079 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 
Published date : 21 Jan 2019 03:28PM

Photo Stories