ఇగ్నో రీజనల్ డెరైక్టర్‌గా తెలుగు వ్యక్తి
Sakshi Education
విజయవాడ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ప్రాంతీయ కేంద్రాల విభాగానికి (రీజనల్ సర్వీసెస్ డివిజన్-న్యూఢిల్లీ) డెరైక్టర్‌గా తెలుగు వ్యక్తి డాక్టర్ వి.వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఈ బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి వేణుగోపాల్‌రెడ్డి. 2015 మే నుంచి 2018 వరకు మూడేళ్లపాటు ఆయన డెరైక్టర్‌గా కొనసాగుతారు. దూర విద్యా రంగానికి సంబంధించిన సేవలను మరింత మెరుగు పరచేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన 1987లో ఇగ్నోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.
Published date : 18 May 2015 02:08PM