ఎస్వీయూ దూరవిద్య నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): ఎస్వీయూలో దూరవిద్య విభాగంలో 2016-2017 విద్యా సంవత్సరానికి పీజీ, డిగ్రీ,డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను వీసీ దామోదరం ఈనెల 23న విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దరఖాస్తులను ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం చిత్తూరు జిల్లాలోని 14 అధ్యయన కేంద్రాలు, ఎస్వీయూలోని నోడల్ కేంద్రం నుంచి అడ్మిషన్ పొందవచ్చన్నారు.
Published date : 24 Mar 2017 02:49PM