ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షా ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం గతేడాది డిసెంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేసింది.
ఈ మేరకు దూరవిద్య కేంద్రం పరీక్షల విభాగం జాయింట్ రిజిస్ట్రార్ బి.సత్యవతి మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, గణితం, ఎంకాం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎమ్మెస్సీ జువాలజీ కోర్సులతో పాటు పలు పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు.
Published date : 11 Mar 2020 03:11PM