Skip to main content

దూరవిద్య పరీక్షల ఫీజు గడువు ఫిబ్రవరి 25 వరకు..

గుంటూరు ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం పరిధిలో నిర్వహించే దూరవిద్య యూజీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 25 వరకు ఉందని జేకేసీ కళాశాల క్యాంపస్‌లోని వర్సిటీ స్టడీ సెంటర్ ప్రాంతీయ సమన్వయకర్త పి.గోపీచంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రూ.300 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు తుది గడువు ఈ నెల 28న ముగియనుందని పేర్కొన్నారు. మార్చి 13 నుంచి రెండో సెమిస్టర్, మార్చి 21 నుంచి నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. వివరాలకు 0863-2227950, 7382929605 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 06 Feb 2021 03:37PM

Photo Stories