డిసెంబర్ 31 వరకు ఓయూ దూరవిద్య ప్రవేశాలు
Sakshi Education
హైదరాబాద్: ఓయూలోని ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో వివిధ డిగ్రీ, పీజీ, డిప్లొమో కోర్సుల్లో 2018-19 విద్యా సంవత్సరానికి డిసెంబర్ 31 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చని డెరైక్టర్ ప్రొ.చింత గణేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర పీజీ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు.
Published date : 13 Dec 2018 01:50PM