Skip to main content

డిసెంబర్ 1 నుంచి ‘మనూ’ దూర విద్య పరీక్షలు

హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ వర్సిటీలోని దూర విద్యా వార్షిక పరీక్షలను డిసెంబర్ 1 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు.
పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఏ ఉర్దూ, చరిత్ర, ఇంగ్లిష్, ఇస్లామిక్ స్టడీస్, గ్రాడ్యుయేట్ కోర్సుల్లో బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు పీజీ డిప్లమో, సర్టిఫికెట్ కోర్సులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే అర్హులు. పరీక్షల టైంటేబుల్ వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచారు.
Published date : 29 Sep 2016 02:46PM

Photo Stories