ఆన్‌లైన్‌లో ఏయూ దూరవిద్య సేవలు
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) దూరవిద్యా కేంద్రం ఇకపై తమ సేవలను ఆన్‌లైన్‌లో అందించనుంది.
ఈ మేరకు టాటా కన్సల్టెన్సీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏయూ సెనెట్ మందిరంలో శుక్రవారం వర్సిటీ, టీసీఎస్ అధికారులు సంతకాలు చేశారు. అనంతరం వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దూరవిద్య ప్రవేశాలు, వార్షిక ఫీజుల చెల్లింపులు, పరీక్ష హాల్ టికెట్ల జారీ, ఫలితాల విడుదల వంటి అన్ని సేవలు ఇక పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్‌లైన్ విధానం విద్యార్థులకుసౌలభ్యంగా ఉంటుందని టీసీఎస్ స్ట్రాటజీ హెడ్ రాజారెడ్డి అన్నారు.
Published date : 01 Apr 2017 12:23PM