అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు నవంబర్ 20 వరకు పొడిగింపు
Sakshi Education
బంజారాహిల్స్ (హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ), పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని నవంబర్ 20 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డా. జి.లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్లలో ఆయా కోర్సుల్లో చేరేందుకు విదార్హతలు, ఫీజు తదితర వివరాలను యూనివర్సి టీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చన్నారు. ఇప్పటికే అడ్మిషన్ పొంది ఉండి.. వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన డిగ్రీ ద్వితీయ, తృతీ య సంవత్సర విద్యార్థులు, పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీజు కట్టలేకపోయిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Published date : 16 Nov 2020 03:32PM