అంబేద్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్ష గడువు పెంపు
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దూర విద్య విశ్వవిద్యాలయం అర్హత పరీక్ష-2015 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీని మార్చి 31 వరకు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.సుధాకర్ మార్చి 16న తెలిపారు.
డిగ్రీ కోర్సుల్లో చేరడానికి 18 ఏళ్లు పైబడిన వారు, కనీస విద్యార్హత లేకున్నా.. ఈ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలు, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్టడీ సెంటర్స్, వర్సిటీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.
Published date : 17 Mar 2015 12:47PM