అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 22న జరిగే అర్హత పరీక్షకు ఫీజు చెల్లించేందుకు తుది గడువు జూలై 16న ముగియనుందని గుంటూరు జేకేసీ కళాశాలలోని వర్సిటీ ప్రాంతీయ సమన్వయకర్త పరుచూరి గోపీచంద్ ఓ ప్రకటనలో తెలిపారు.
జూలై ఒకటో తేదీకి 18 ఏళ్ల వయసు నిండి, అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దూరవిద్య డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అర్హులని తెలిపారు. వివరాలకు 0863-2227950, 73829 29605 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 16 Jul 2018 02:13PM