Skip to main content

అక్టోబరు 10 నుంచి తెలంగాణ ‘ఓపెన్’ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పరీక్షలను అక్టోబరు 10 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు సొసైటీ డెరైక్టర్ వేంకటేశ్వర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 26 నుంచి 28 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Published date : 25 Aug 2015 04:37PM

Photo Stories