అక్టోబర్ 21 నుంచి డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
Sakshi Education
బంజారాహిల్స్: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) విద్యార్థులకు అక్టోబర్ 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 21 నుంచి ఆక్టోబర్ 26 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 3 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 5 నుంచి నవంబర్ 8 వరకు జరుపుతామని వెల్లడించారు. పరీక్షల సమయం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థులు వర్సిటీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వివరాలకు సంబంధిత అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని, రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 25 ఆఖరి తేదీ అని పేర్కొన్నారు.
Published date : 09 Sep 2019 12:44PM