అక్టోబర్ 14 నుంచి అంబేడ్కర్ బీఎడ్ కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: 2018-19 విద్యా సంవత్సరానికి గాను బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు అక్టోబర్ 14 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం డెరైక్టర్ పి.కృష్ణారావు తెలిపారు.
హైదరాబాద్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీ ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 14వ తేదీ ఉదయం 9 గంటలకు ఫిజిక్స్, మధ్యాహ్నం 12 గంటలకు బయోలజీ కౌన్సెలింగ్ ఉంటాయని వెల్లడించారు. 15, 16 తేదీల్లో ఉదయం 9 గంటలకు మ్యాథ్య్, సోషల్ స్టడీస్ ప్రవేశాలు ప్రారంభం అవుతాయని వివరించారు.
Published date : 10 Oct 2018 02:29PM