6 న ‘మనూ’ దూరవిద్యా బీఈడీ దరఖాస్తు గడువు ముగింపు
Sakshi Education
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో దూరవిద్యా విభాగంలో బీఈడీ కోర్సులో చేరేందుకు గడువు శుక్రవారంతో ముగియనుంది.
వర్సిటీ వెబ్‌సైట్ www.manuu.ac.in లో ఉండే దరఖాస్తుల ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇన్ సర్వీసు టీచర్లు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాసైన విద్యార్థులు కోర్సులో చేరేందుకు అర్హులు. ప్రవేశ పరీక్షను జూన్ 5న హైదరాబాద్‌తో పాటు దర్భంగా, ముంబై, బెంగళూరు, జమ్మూ, శ్రీనగర్, కోల్‌కతా, భోపాల్, న్యూఢిల్లీ, రాంచి, పట్నా, అమరావతి నగరాల్లో నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌తో పాటు దేశంలోని 23 కేంద్రాలలో దూరవిద్య ద్వారా బీఈడీ కోర్సును అమలు చేస్తున్నారు.
Published date : 06 May 2016 02:28PM