Skip to main content

5 నుంచి ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షలు

ఏఎన్‌యూ: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించే 2016 క్యాలెండర్ సంవత్సరం బ్యాచ్ పీజీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల పరీక్షలు ఈనెల ఐదో తేదీన ప్రారంభం కానున్నాయి.
ఏపీలో 41, తెలంగాణలో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల నుంచి అన్ని కోర్సులకూ కలిపి 29,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వారిలో పీజీ కోర్సుల నుంచి 15,400 మంది, యూజీ కోర్సుల నుంచి 14,505 మంది, డిప్లొమా కోర్సుల నుంచి 75 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, దూరవిద్య పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ కె.వీరయ్య తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్లు, గుర్తింపు కార్డులను www.anucde.info వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల వినతి మేరకు ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు రెండు కేంద్రాల్లో మార్పులు చేశామన్నారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరీక్షా కేంద్రాన్ని మహబూబాబాద్‌లోని మదర్ థెరిస్సా బీఈడీ కళాశాల కేంద్రానికి, ఖమ్మంలోని కాకతీయ వర్సిటీ పీజీ సెంటర్ కేంద్రాన్ని ఇల్లెందులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మార్చామన్నారు.
Published date : 05 Dec 2016 04:09PM

Photo Stories