Skip to main content

17న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించే అర్హత పరీక్ష -2016 దరఖాస్తుకు రూ. 100 అపరాధ రుసుముతో ఏప్రిల్ 7వ తేదీ చివరి గడువని యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఎ. సుధాకర్ తెలిపారు.
ఈ పరీక్షను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 17న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఈ-సేవా, మీ-సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చన్నారు. 18సంవత్సరాల వయసు నిండి కనీస విద్యార్హత లేని వారు డిగ్రీ కోర్సులో చేరేందుకు ఇది చక్కని అవకాశమన్నారు.
Published date : 01 Apr 2016 01:34PM

Photo Stories