Daily Current Affairs in Telugu: 2022, జూన్ 4 కరెంట్ అఫైర్స్
The eyes of the world are now on India: Prime Minister Narendra Modi:ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్ వైపు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధి చరిత్రకు ఉత్తరప్రదేశ్ ఊపునిస్తుందని, దేశానికి చోదకశక్తిగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేడు ప్రపంచం అన్వేషిస్తున్న ఒక నమ్మకమైన భాగస్వామిగా భారత్ అవతరించిందని చెప్పారు. నమ్మకమైన భాగస్వామిగా తనను తాను నిరూపించుకొనే సత్తా ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు మాత్రమే ఉందన్నారు. జూన్ 3 (శుక్రవారం) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడో పెట్టుబడిదారుల సదస్సును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రంగాల్లో రూ.80,000 కోట్లకు పైగా విలువైన 1,406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు భారత్‌కు ఎన్నెన్నో గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టాయని వివరించారు. ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని, మన శక్తి సామర్థ్యాలను కొనియాడుతోందని గుర్తుచేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
అదొక సరికొత్త రికార్డు
- ‘‘జి–20 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్లోబల్ రిటైల్ సూచికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో చమురు, విద్యుత్, గ్యాస్ శక్తిని ఉపయోగించుకొనే దేశాల్లో మూడో స్థానంలో ఉంది. గతేడాది 100కు పైగా దేశాల నుంచి ఇండియాకు రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 417 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశాం. ఇదొక సరికొత్త రికార్డు.
సంస్కరణలు కొనసాగుతాయ్
- మన ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. ఎనిమిదేళ్లుగా సంస్కరణ–పనితీరు–మార్పు అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం. విధాన నిర్ణయాల్లో స్థిరత్వం, పరస్పర సహకారం, సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నాం. ‘ఒకే దేశం–ఒకే పన్ను, ఒకే దేశం–ఒక్కటే రేషన్ కార్డు’ వంటివి మన స్పష్టమైన, బలమైన ప్రయత్నాలకు నిదర్శనం. రక్షణ రంగంలో తయారీకి గతంలో ఎవరూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్నాం.
- ఆత్మనిర్భర్ అభియాన్‌లో భాగంగా 300 రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారు చేసుకోబోతున్నాం. రక్షణ తయారీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టబోతున్నవారికి మార్కెట్ సిద్ధంగా ఉంది. దేశంలో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని రంగాల్లో సంస్కరణలు చేపడతాం.
నవ్య కాశీని సందర్శించండి
- 2014 పోలిస్తే ఇప్పుడు దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. అప్పట్లో 6 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులు ఉండేవారు. ఇప్పుడు 78 కోట్లకు చేరారు. జీబీ డేటా ధర రూ.200 ఉండేది రూ.11–12కు దిగొచ్చింది. 2014లో 100 కంటే తక్కువ గ్రామాలే ఆప్టికల్ ఫైబర్‌తో కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు వాటి సంఖ్య 1.75 లక్షలు. 70 వేల దాకా రిజిస్టర్డ్ స్టార్టప్‌లు ఉన్నాయి. యూపీలో నా సొంత నియోజకవర్గం వారణాసిని సందర్శించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా. ఘనమైన పురాతన చరిత్ర ఉన్న కాశీ నవ్యత్వాన్ని సంతరించుకుంటోంది’’ అని మోదీ వెల్లడించారు.
- యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దారుల సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, కుమార మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పెట్టుబడులు, ఉద్యోగాల గురించి వివరించారు. మోదీ విజన్‌కు అనుగుణంగా పని చేస్తున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
The Rajya Sabha has 41 members elected: రాజ్యసభకు 41 మంది ఏకగ్రీవం
- పెద్దల సభకు కొత్తగా 41 మంది పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పి.చిదంబరం, రాజీవ్ శుక్లా, బీజేపీ నుంచి సుమిత్రా వాల్మీకి, కవితా పటిదార్, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్, ఆర్జేడీ నుంచి మీసా భారతి, ఆర్‌ఎల్డీ నుంచి జయంత్ చౌదరి తదితరులు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.
- ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 11 మంది, తమిళనాడు నుంచి ఆరుగురు, బిహార్ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, ఒడిశా నుంచి ముగ్గురు, చత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, పంజాబ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు, జార్ఖండ్ నుంచి ఇద్దరు, ఉత్తరాఖండ్‌నుంచి ఒక్కరు ఎన్నికయ్యారు. మొత్తం 41 మందిలో 14 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్, నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ముగ్గురు డీఎంకే, ముగ్గురు బీజేడీకి చెందినవారున్నారు.
- ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఏఐఏడీఎంకే నుంచి ఇద్దరు చొప్పున ఎన్నికయ్యారు. జేఎంఎం, జేడీయూ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్డీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు.
- తాజా ఎన్నికతో ఎగువ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఏకంగా తొమ్మిదికి చేరింది. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాల భర్తీ చేయడానికి ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగిసింది. ఏకగ్రీవం కాగా మిగిలిన 16 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్‌లో 4, కర్ణాటకలో 4, హరియాణాలో 2 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.
- చదవండి: Quiz of The Day(June 02, 2022) >> తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది?
- Quiz of The Day(June 01, 2022) >> ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం?