Skip to main content

Abhijit Katake: ‘హింద్‌ కేసరి’ అభిజీత్

ప్రతిష్టాత్మక ‘హింద్‌ కేసరి’ జాతీయ సీనియర్‌ ఇండియన్‌ స్టయిల్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్‌ అభిజీత్‌ కాట్కే చాంపియన్‌గా నిలిచాడు.

జ‌న‌వ‌రి 8న హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన పురుషుల ‘హింద్‌ కేసరి’ టైటిల్‌ బౌట్‌ ఫైనల్లో అభిజీత్‌ 5–0తో హరియాణాకు చెందిన సోమ్‌వీర్‌పై విజయం సాధించాడు. విజేత అభిజీత్‌ తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వి. శ్రీనివాస్‌ గౌడ్, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా మూడు కిలోల వెండి గదను అందుకున్నాడు. 
‘మహిళా హింద్‌ కేసరి’ విజేత పుష్ప  
‘మహిళా హింద్‌ కేసరి’ టైటిల్‌ హరియాణాకు చెందిన పుష్ప సొంతం చేసుకుంది. ఫైనల్లో పుష్ప ఢిల్లీకి చెందిన మోహినిపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. పుష్ప, మోహిని మధ్య జరిగిన టైటిల్‌ బౌట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీక్షించారు. 
మెరిసిన తెలంగాణ రెజ్లర్లు.. 
‘హింద్‌ కేసరి’ టైటిల్‌ బౌట్స్‌ కాకుండా మిగతా వెయిట్‌ కేటగిరీలలో తెలంగాణ రెజ్లర్లు ఆకట్టుకున్నారు. మహిళల 62 కేజీల విభాగంలో సాహిర్‌ ఇబ్రహీమ్‌.. 48 కేజీల విభాగంలో బాలమణి.. 56 కేజీల విభాగంలో శ్రావణి తెలంగాణకు కాంస్య పతకాలు అందించారు. పురుషుల 60 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్లు నితీశ్, సయ్యద్‌ అబ్దుల్‌.. 65 కేజీల విభాగంలో విజయ్‌ కుమార్‌.. 70 కేజీల విభాగంలో దినేశ్, విజయ్‌.. 75 కేజీల విభాగంలో హంజా బామస్, సయ్యద్‌ బిన్‌ అబ్దుల్లా.. 80 కేజీల విభాగంలో సందీప్‌ యాదవ్‌ కాంస్య పతకాలు సాధించారు.   

ITTF World Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో మనిక బత్రా

Published date : 09 Jan 2023 05:50PM

Photo Stories