World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో మూడు పతకాలు ..
పంజాబ్ అమ్మాయి సిఫ్ట్ కౌర్ సమ్రా మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో, వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాలు సొంతం చేసుకుంది.
టీమ్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్‌లతో కూడిన భారత జట్టు 3527 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ 462.9 పాయింట్లతో విజేతగా నిలువగా, ఆశి చౌక్సీ 461.6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకొని ఆశి చౌక్సీ గెలిచింది.
☛☛ World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో రెండు స్వర్ణాలు
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో అర్జున్ సింగ్ చీమా, వరుణ్ తోమర్, అన్‌మోల్ జైన్‌లతో కూడిన భారత జ ట్టు 1730 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 4 రజతాపతకా, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.