మళ్లీ టాప్–10లోకి శ్రీకాంత్
Sakshi Education
భారత టాప్ బ్యాడ్మింటన్ ఆటగాడు, వరల్డ్ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరోసారి టాప్–10లోకి ప్రవేశించాడు.
గత వారం 14వ ర్యాంక్‌లో ఉన్న అతను నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇదే టోర్నీలో కాంస్యం సాధించిన లక్ష్య సేన్ కూడా 19నుంచి 17వ ర్యాంక్‌కు చేరుకోగా, సాయిప్రణీత్ 16నుంచి 18కి పడిపోయాడు.
Published date : 23 Dec 2021 05:20PM