Jehan Daruvala: జెహాన్ దారువాలాకు మూడో స్థానం
Sakshi Education
ఫార్ములా–2 రేసింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సౌదీ అరేబియా రేసులో భారత డ్రైవర్ జెహాన్ దారువాలా మూడో స్థానంలో నిలిచాడు.

జెడ్డాలో జరిగిన ఈ రేసులో నెదర్లాండ్స్‌కు చెందిన ఎంపీ మోటార్‌స్పోర్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెహాన్ నిర్ణీత 28 ల్యాప్‌లను 50 నిమిషాల 53.133 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని పొందాడు. వెస్టీ (ప్రెమా రేసింగ్) తొలి స్థానంలో, దూహన్ (విర్టోసీ రేసింగ్) రెండో స్థానంలో నిలిచారు. సీజన్‌లో రెండు రేసులు పూర్తయ్యాక జెహాన్ 24 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
Published date : 21 Mar 2023 05:42PM