Danish Open Swimming: 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణం నెగ్గిన స్విమ్మర్?
డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్‌హాగెన్ వేదికగా జరుగుతోన్న డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్–2022లో భారత యువ స్విమ్మర్ వేదాంత్ మాధవన్ రెండో పతకాన్ని సాధించాడు. తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వేదాంత్ ఏప్రిల్ 18న పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 800 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల 17.28 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వేదాంత్.. ఈ టోర్నీలో 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలోనూ రజతం నెగ్గిన విషయం విదితమే. ప్రముఖ సినీ నటుడు మాధవన్ కుమారుడైన వేదాంత్.. 2022 ఏడాది లాత్వియా ఓపెన్‌లో కాంస్యం నెగ్గాడు. జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించాడు.
Chess: ఫాగర్నెస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్?
Danish Open swimming: డానిష్ ఓపెన్‌లో స్వర్ణం సాధించిన భారత స్విమ్మర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్–2022లో స్వర్ణ పతకం గెలిచిన భారతీయ స్విమ్మర్?
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : వేదాంత్ మాధవన్
ఎక్కడ : కొపెన్‌హగెన్, డెన్మార్క్
ఎందుకు : పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వేదాంత్.. 800 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల 17.28 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్