BBL: టి20ల్లో అత్యల్ప స్కోరు నమోదు.. 15 పరుగులకే ఆలౌట్!
Sakshi Education
ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్.. ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న టి20 టోర్నీ.. ఇప్పటికే ఒక సారి చాంపియన్‌గా నిలిచిన సిడ్నీ థండర్ జట్టు.. కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆ జట్టు టి20 చరిత్రలో తలదించుకునే రికార్డు నమోదు చేసింది.
డిసెంబర్ 16న అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా, ఎక్స్‌ట్రాల రూపంలో 3 పరుగులు వచ్చాయి. 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్ పేసర్ హెన్రీ థార్టన్ సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్ అగర్ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు 139 పరుగులు చేసిన స్ట్రైకర్స్ 124 పరుగులతో మ్యాచ్ గెలుచుకుంది. 0 0 3 0 2 1 1 0 0 4 1.. ఇవీ ఒక టి20 మ్యాచ్‌లో వరుసగా 11 మంది ఆటగాళ్ల స్కోర్లు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (11-17 నవంబర్ 2022)
టి20 క్రికెట్‌లో ఇదే అత్యల్ప స్కోరు.. 2019లో కాంటినెంటల్ కప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు (35) సాగిన ఇన్నింగ్స్ కూడా ఇదే.
Published date : 17 Dec 2022 06:04PM