World Shooting Championship: అనీశ్ – సిమ్రన్‌లకు సిల్వర్
Sakshi Education
కైరో: వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో రజత పతకాన్ని గెలుచుకుంది.
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత ద్వయం రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్లో అనీశ్ – సిమ్రన్‌ప్రీత్ కౌర్ ద్వయం 14–16 స్కోరుతో ఉక్రెయిన్‌కు చెందిన యులి యా కొరొస్టైలోపొవా – మాక్సిమ్ హొరడైనెట్స్ చేతిలో పరాజయంపాలైంది. తాజా వెండి పతకంతో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 26కు చేరగా, జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 10 స్వర్ణాలు, 6 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 21 Oct 2022 07:04PM