ISSF Shooting World Cup టోర్నీలో మెహులి–తుషార్ జోడీకి స్వర్ణం
Sakshi Education
దక్షిమ కొరియాలోని చాంగ్వాన్ జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం, ఒక కాంస్య పతకం చేరాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మెహులి ఘోష్–షాహు తుషార్ మనే జోడి బంగారం గెలుపొందగా, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో పాలక్–శివ నర్వాల్ కాంస్య పతకం చేజిక్కించుకుంది. జూలై 13న జరిగిన ఎయిర్ రైఫిల్ ఫైనల్లో మెహులి–తుషార్‌లతో కూడిన భారత ద్వయం 17–13తో హంగేరికి చెందిన ఎజ్తెర్ మెస్జారొస్–ఇస్‌త్వాన్ పెన్ జంటపై విజయం సాధించింది. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో జరిగిన కాంస్య పతక పోరులో పాలక్–శివ జోడీ 16–0తో ఇరినా లొక్తియోనొవా–వలెరి రఖింజాన్ (కజకిస్తాన్) జంటపై ఏకపక్ష విజయం సాధించింది.
Also read: Shooting World Cup:ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో అర్జున్ కి స్వర్ణం
Published date : 14 Jul 2022 05:57PM