Badminton: బీడబ్ల్యూఎఫ్ అవార్డుకు ఎంపికైన భారత క్రీడాకారుడు?
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సముచిత రీతిలో గౌరవిస్తూ ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’కు ఎంపిక చేసింది. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీని గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన మాజీ వరల్డ్ నంబర్‌వన్ ప్రకాశ్ పడుకోన్ ఆ తర్వాత 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా వ్యవహరించడంతో పాటు ఓజీక్యూ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు.
డబ్ల్యూటీఏ ఫైనల్స్–2021 ట్రోఫీ విజేత?
సీజన్ చివరి టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్–2021లో స్పెయిన్ తార గాబ్రిన్ ముగురుజా మెరిసింది. నవంబర్ 18న మొక్సికోలోని జపోపాన్‌లో జరిగిన ఫైనల్లో ముగురుజా 6–3, 7–5తో అనెట్ కొంటావీట్ (ఎస్టోనియా)పై గెలుపొంది తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా ఈ టోర్నీని నెగ్గిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా చరిత్రకెక్కింది. 1993లో అరంటా సాంచెజ్ వికారియో ఫైనల్లో ఓడింది.
చదవండి: ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన భారతీయుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’కు ఎంపికైన భారత క్రీడాకారుడు?
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్
ఎక్కడ : బ్యాడ్మింటన్ క్రీడలో విశేష ప్రతిభ కనబరిచినందుకుగాను..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్