Skip to main content

Olympics: పారిస్‌ ఒలంపిక్స్‌ను బహిష్కరించాల‌న్న పోలండ్‌

2024 పారిస్‌ ఒలంపిక్స్‌లో రష్యా, బెలారస్‌ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్‌ హెచ్చరించింది.

రష్యా, బెలారస్‌లు ఒలంపిక్స్‌ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్‌ మంత్రి కమిల్‌ చెప్పారు. ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఫిబ్ర‌వ‌రి 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్‌ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది.

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం

Published date : 04 Feb 2023 01:26PM

Photo Stories